‘కాపు నేస్తం’ ప్రారంభించిన జగన్

Update: 2020-06-24 08:39 GMT

గత పదమూడు నెలల కాలంలోనే ఏపీలోని ప్రజలకు 43 వేల కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేవుడి చల్లని దీవెనతో పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బుధవారం నాడు సీఎం జగన్ ఆర్ధికంగా వెనకబడి ఉన్న కాపు మహిళలకు ఆర్ధిక స్వాలంభన కల్పించేందుకు ‘కాపు నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కాపు నేస్తం పథకం ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు 4,770 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బియ్యం కార్డు ఉన్న వారు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు చేస్తున్నట్లు తెలిపారు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నామని తెలిపారు.

Similar News