ఏపీలో మరో అరవై కేసులు

Update: 2020-05-01 07:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు లెక్క ఏ మాత్రం ఆగటం లేదు. పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తుండటంతో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే 25, గుంటూరు జిల్లాలో 19 ఉన్నాయి. అనంతపురంలో 6,విశాఖపట్నంలో 2 వెలుగుచూశాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మరణించారు.

ఒకరు కర్నూలు, మరొకరు నెల్లూరులో మరణించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 33కు పెరిగింది. ఇప్పటి వరకూ 403 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్లారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1027 మంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1463కు చేరింది. గత 24 గంటల్లో ఏపీలో 7902 శాంపిళ్ళను పరీక్షించారు.

Similar News