ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపుతారా?

Update: 2020-04-03 11:38 GMT

కరోనాపై పోరులో ప్రాణాలకు తెగించిన శ్రమిస్తున్న వైద్యులకు ఏపీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపుతారా? అని ప్రశ్నించారు. డాక్టర్లు చెప్పేది విని వారికి కావాల్సిన సౌకర్యలు కల్పించాలని కోరారు.వైద్యులు,వారికి అనుబంధంగా ఉన్న సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) పూర్తి స్థాయిలో అందించాలని కోరారు.

పీపీఈ పూర్థి స్థాయిలో వైద్యులకు, సిబ్బందికి ఇవి అందుబాటులో ఉంచకపోవటం దురదృష్టకరమన్నారు. మెడికిల్ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు ఇవ్వకుండా కరోనా వైరస్ పై పోరులో వారిని పోరాడాలనటం సరికాదన్నారు. డబ్ల్యుహెచ్ వో మార్గదర్శకాల ప్రకారం వైద్యులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

విరాళాలు బదిలీ చేసిన పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి సహాయనిధికిగాను పి.ఎమ్.కేర్స్ నిధికి రూ. కోటి విరాళం పంపించారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు సంబంధిత ఖాతాలకు ఆ విరాళాలను బదిలీ చేశారు. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్యఆరోగ్య సేవలు, ఇతర సేవలకు నిధులు అవసరం. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని పవన్ కోరారు. కరోనాపై పోరులో భాగంగా ప్రతి ఒక్క భారతీయుడు దేశం కోసం రూ.100 ఆపైన తమ శక్తి కొద్దీ పి.ఎమ్.కేర్స్ కు విరాళం ఇవ్వాలని... ఇంకో పది మంది విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపునిచ్చారు.

Similar News