ఏపీలోనూ డాక్టర్లు..పోలీసులకు పూర్తి జీతాలు

Update: 2020-04-04 08:57 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకున్నారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ రెండు విడతల్లో వేతనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ శనివారం నాడు జరిగిన సమీక్షలో కోవిడ్‌ –19 నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్య–ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌ నివారణకు వారుచేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... ఈ మూడు కేటగిరీల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుని..అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Similar News