ఏపీ, తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో లాక్ డౌన్

Update: 2020-03-22 12:55 GMT

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు దేశమంతటా ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశమంతా సంఘీభావంగా నిలిచింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం దేశమంతా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది, మీడియాకు కృతజ్ణతలు తెలుపుతూ చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. అదే సమయంలో రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం చకచకా నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగానే ఈ నెల 31 వరకూ అన్ని ప్యాసింజర్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు దేశంలోని మొత్తం 75 జిల్లాల్లో లాక్ డౌన్ ను ప్రకటించింది. ఇందులో తెలంగాణలో ఐదు జిల్లాలు, ఏపీలో మూడు జిల్లాలు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ లో తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ,సంగారెడ్డి భద్రాద్రి జిల్లా లు ఉన్నాయి. ఏపీలో విశాఖ, ప్రకాశం, కృష్ణాజిల్లాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచనలు చేసింది.

 

 

Similar News