జగన్ సర్కారు సంచలన నిర్ణయం

Update: 2020-03-09 16:26 GMT

జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ నెల 12 నుంచి 29 వరకూ మద్యం బంద్ చేయాలని నిర్ణయించారు. షాప్ లు మూసి వేయటంతోపాటు సరఫరా కూడా నిలిపివేస్తారు. ప్రస్తుతం ఏపీలో మద్యం దుకాణాలను సర్కారే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పదవులు పోయేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇప్పుడు మద్యం షాపులను తాత్కాలికంగా బంద్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 18 రోజుల పాటు మద్యం సరఫరాకు బ్రేక్ పడనుంది.

మార్చి 12 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను మూసివేస్తామని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. తెలిపారు. జిల్లా ఎస్పీలు డబ్బుల పంపిణీ, మద్యాన్ని అరికట్టాలని ఇప్పటికే సీఎం జగన్ సూచించారు. అయితే సర్కారు నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఎన్నికల సమయం అంటే డబ్బు పంపిణీ, మద్యం సరఫరా అన్నది గత కొన్ని సంవత్సరాలుగా సర్వసాధారణంగా మారిపోయింది. ఈ తరుణంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏ మేరకు అమలు అవుతుంది అన్నది వేచిచూడాల్సిందే. మరోవైపు చిత్తూరులో జిల్లాలోమంత్రి పెద్దిరెడ్డి చెన్నయ్ నుంచి తెప్పించి మరీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు.

 

Similar News