తెలంగాణ సచివాలయం కూల్చొద్దు..హైకోర్టు

Update: 2020-02-12 12:27 GMT

తెలంగాణ సర్కారుకు షాక్. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కనీసం డిజైన్లు కూడా ఖరారు చేయకుండా ఇప్పటి సచివాలయ భవనాలను కూల్చాల్సిన అవసరం ఏముందని..ఎందుకు అంత తొందరని అని హైకోర్టు ప్రశ్నించింది. మెరుగైన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇంకా డిజైన్లు ఖరారు కాలేదనటంలో అర్ధం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

డిజైన్ లేకుండా కొత్త సచివాలయం నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. నూతన సచివాలయ నిర్మాణం, పాత భవనాల కూల్చివేత అంశంపై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కూల్చివేతపై హైకోర్టు సమగ్ర నివేదిక కోరగా ప్రభుత్వం మాత్రం కోర్టుకు పూర్తి వివరాలు అందించలేదు.

 

Similar News