కెసీఆర్ కు సవాల్

Update: 2019-11-06 14:08 GMT

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి తెలంగాణలో రగడ నడుస్తూనే ఉంది. సీఎం కెసీఆర్ అసలు కార్మికులతో చర్చలకు ఛాన్సే లేదని డెడ్ లైన్లు పెడుతూ వెళుతున్నారు. చర్చలు ద్వారా పరిష్కారం అయితేనే తాము విధుల్లో చేరతామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో ఆర్టీసి మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీఆర్ఎస్ లో ఉన్న ఆయన తర్వాత పార్టీ నేతలతో తలెత్తిన విభేదాలతో టీఆర్ఎస్ ను వీడారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకుంటే ఐదు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తప్పుపట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు బస్సులతో ప్రయాణ చార్జీలు పెంచకుండా నడపగలరా అని ప్రశ్నించారు. అలా నడిపితే తాను గుండు గీసుకోవడానికి సిద్ధమని సవాల్‌ విసిరారు. నడపకపోతే కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు.

Similar News