ఏపీలో ఇసుక కేసు..తొలి శిక్ష

Update: 2019-11-22 08:08 GMT

ఇసుక అక్రమ రవాణాపై ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు చట్టంలో కఠిన నిబంధనలు పెట్టింది. ఎవరైనా ఇసుకను అక్రమం తరలించినట్లు తేలితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేలా మార్పులు చేశారు. చట్టం అమల్లోకి వచ్చి వారం రోజులు కూడా కాకుండానే తొలి శిక్ష పడింది. అది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కావటం విశేషం. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజు పల్లె గ్రామంలో ఇసుక అక్రమ రవాణపై కేసు నమోదు. ఈ కేసులో నిందితునికి మూడేళ్ల శిక్ష విధించిన కడప జిల్లా అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్. మూడేళ్ల శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా.

Similar News