ఆర్టీసీ సమ్మె..ఆర్ధిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

Update: 2019-11-07 06:42 GMT

ఆర్టీసి సమ్మెపై తెలంగాణ హైకోర్టు గురువారం ఉదయమే విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్లు హాజరయ్యారు. విచారణ సందర్భంగా హైకోర్టు మరోసారి ఐఏఎస్ అధికారుల లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న హైకోర్టు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంది.

ఐఏఎస్‌ అధికారులు అసమగ్ర నివేదకలు ఇవ్వడం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా ? అని ప్రశ్నించినన హైకోర్టు. స్వయంగా వివరణ ఇస్తున్న ఆర్థికశాఖ.. ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామన్న రామకృష్ణారావు. మన్నించాలని హైకోర్టును కోరిన రామకృష్ణారావు. క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు చెప్పాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Similar News