ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి గవర్నర్

Update: 2019-10-17 15:30 GMT

రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే హైకోర్టు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని..తక్షణమే ఆర్టీసీ ఎండీని నియమించాలని సూచించగా..సర్కారు మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నట్లుగానే ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో గవర్నర్ నేరుగా రంగంలోకి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేయటంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మంత్రి ఆర్టీసి సమ్మెపై గవర్నర్ కు వివరాలు అందజేసేందుకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని గవర్నర్ వద్దకు పంపారు మంత్రి.

ఆర్టీసీ సమ్మెతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని..సమ్మెకు సంబంధించి తన దృష్టికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినందున సత్వరమే ఈ వ్యవహారం సద్దుమణిగేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మె కారణంగానే పాఠశాలలు, కాలేజీలకు సెలవులను కూడా సర్కారు ఏకంగా వారం రోజులు పొడిగించింది. ఈ అంశం కూడా గవర్నర్ లేవనెత్తినట్లు సమాచారం. ఈ అంశంపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ ఉండటంతో సర్కారు కోర్టుకు ఏమి చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

 

Similar News