నారా లోకేష్ దీక్ష

Update: 2019-10-30 07:59 GMT

టీడీపీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తొలిసారి దీక్షకు కూర్చున్నారు. ప్రస్తుతం ఏపీని కుదిపేస్తున్న ఇసుక సమస్యపై ఆయన గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ దీక్ష చేయనున్నారు. దీక్షలో నారా లోకేష్ తోపాటు ఎంపీ గల్లా జయదేవ్ , మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు మరికొంత మంది టీడీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. వైసీపీ నేతలు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడంవల్లే ఇసుక దొరకడం లేదని లోకేష్ ఆరోపించారు.

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో అల్లాడుతున్నారని.. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఎక్కడా ఆకలి బాధలు లేవని చెబుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరతపై ధర్నాలు నిర్వహిస్తోంది. నారా లోకేష్ దీక్ష సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వెరైటీగా ఇసుక ప్యాకెట్లతో కూడిన దండలు వేశారు.

 

Similar News