ఇద్దరమ్మాయిల పెళ్లి

Update: 2019-07-04 13:33 GMT

అమ్మాయి..అబ్బాయి పెళ్లి సహజం. ఇద్దరు అబ్బాయిలు అయినా..ఇద్దరు అమ్మాయిల పెళ్లి అయినా అసహజం. అయినా సరే కొంత మంది ఇది మా ఇష్టం అంటున్నారు. భారత్ లో ప్రస్తుతానికి ఈ సంస్కృతి చాలా తక్కువే. కానీ ఈ మధ్య కాలంలో ఈ తరహా దోరణులు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు సుప్రీంకోర్టు కూడా తాజాగా ఇచ్చిన తీర్పు కొంత మందికి ధైర్యం నూరిపోస్తోంది. ఈ తీర్పు భరోసాతోనే కొంత మంది బయటకు వచ్చి మరీ ఈ విషయాన్ని ప్రకటించేస్తున్నారు కూడా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వరుసకు అక్కా చెల్లెలు అయిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయలకు పుట్టినిల్లుగా పేరొందిన వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఇటువంటి వివాహం జరగటం వారణాసి చరిత్రలో మొదటి సారి పలువులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి తనకు చెల్లి వరుస అయ్యే మరో యువతిని.. స్థానిక శివాలయానికి తీసుకవెళ్లింది. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో.. ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తమకు పెళ్లి జరిపించాలని పూజారిని కోరారు. అయితే ఆయన మాత్రం ఇందుకు నిరాకరించారు. అయినప్పటికీ అక్కడే భీష్మించుకుని కూర్చున్న సదరు యువతులు తమకు తాముగా వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

Similar News