‘అమ్మ ఒడి’పై జగన్ సర్కారు పూటకో మాట

Update: 2019-06-23 08:50 GMT

అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించి ఏపీ సర్కారు పూర్తి గందరగోళంలో ఉన్నట్లు కన్పిస్తోంది. తన పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఏటా 15 వేల రూపాయలు అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ స్కూళ్ళకు పంపేవారికి మాత్రమే వర్తిస్తుందా? లేక ప్రైవేట్ స్కూళ్ళకు కూడా వర్తిస్తుందా అన్న గందరగోళం నెలకొంది. కొద్ది రోజుల క్రితం ఆర్ధిక శాఖ బుగ్గన రాజేంద్రనాధ్ అమ్మ ఒడి ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళే పిల్లలకు మాత్రమే అని ప్రకటించారు. దీంతో క్లారిటీ ఇచ్చినట్లు అయింది. విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ కూడా తొలి ప్రాధాన్యత సర్కారు బడులకే అన్నారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం మరో ప్రకటన చేసింది.

‘పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా అమ్మఒడి పధకం వర్తిస్తుంది. ఆ పిల్లలు చదివేది ప్రైవేటు స్కూల్ అయినా,ప్రభుత్వ స్కూల్ అయినా అమ్మఒడి వర్తిస్తుంది. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే చర్యలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ర్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చేస్తాం. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల లకు అమ్మబడి పధకం వర్తిస్తుంది. ప్రభుత్వ బడులకే అమ్మబడి అని ముందుగా అనుకునప్పటికి పూర్తి మార్పు చేస్తు నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల మెరుగుదల కు పూర్తి స్థాయి చర్యలు’ అంటూ ప్రకటన వెలువడింది. లబ్దిదారుల ఎంపికకు వారి పేదరికాన్ని కొలమానంగా తీసుకోనున్నారు.

 

 

Similar News