అసెంబ్లీ ఎన్నికల తర్వాత రజత్ కుమార్ పై వేటు?!

Update: 2018-12-06 04:46 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ పై వేటు పడనుందా?. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆయన సారధ్యంలో జరగవా?. అంటే ఔననే చెబుతున్నాయి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు. కేంద్రంలో కొత్తగా సీఈసీ బాధ్యతలు చేపట్టిన సునీల్ అరోరాకు రజత్ కుమార్ వ్యవహారంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వెళ్లాయని..వీటి ఆధారంగానే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ లో రజత్ కుమార్ వ్యవహరించిన తీరు..దీనిపై వెల్లువెత్తిన ఫిర్యాదులు ఈసీకి ఇబ్బందికరంగా మారాయి. కొడంగల్ లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించటం ఓ వైపు..అది అలా ఉండగానే మరో వైపు కెసీఆర్ బహిరంగ సభ జరగటం వంటివి పెద్ద దుమారం రేపాయి.

144 సెక్షన్ ఉన్నప్పుడు బహిరంగ సభకు అనుమతి ఎలా ఇస్తారన్నది మౌలికమైన ప్రశ్న. ఈ పరిణామాలు అన్నీ చూస్తే రాజకీయ ఒత్తిళ్ళకు రజత్ కుమార్ తలొగ్గారని సీఈసీ వర్గాలు భావిస్తున్నాయని..అందుకే ఆయన పై వేటుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల ఏర్పాట్లు సజావుగా చేయాల్సిన రజత్ కుమార్ కు...ఇతర అధికారుల మధ్య సఖ్యత కూడా అంత సవ్వంగా లేదని..దీనిపై కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు.

 

Similar News