విజయవాడ-అమరావతి గేట్ వే ప్రాజెక్టులో కదలిక

Update: 2018-11-05 04:23 GMT

విజయవాడలో మరో కన్వెన్షన్ సెంటర్ రాబోతోంది. అంతే కాదు ఓ ఫైవ్ స్టార్ హోటల్ కూడా. సర్వీస్ అపార్ట్ మెంట్లు, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటర్, మల్టీలెవల్ కారు పార్కింగ్, మాల్, మల్టీఫెక్స్, ఎంటర్ టైన్ మెంట్ జోన్ వంటి వాటి నిర్మాణానికి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో పనులు చేసేందుకు ఆసక్తివ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది సర్కారు. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నాయి. ఇప్పటికే నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో సుమారు 40 ఎకరాల్లో ఈ తరహా ప్రాజెక్టుకు ఇప్పటికే ఏపీసీఆర్ డీఏ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.

ఇఫ్పుడు విజయవాడ నగరంలోనూ ఈ తరహా ప్రాజెక్టు చేపట్టేందుకు రెడీ అయిపోయారు. దీనికి అర్హత ఉన్న కంపెనీల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించారు. ఇందులో భాగంగా నగరంలో భారీ పార్కును కూడా డెవలప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పవిత్ర సంగమం వద్ద రివర్ ఫ్రంట్ వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ప్రభుత్వం వివిధ శాఖల ఆధీనంలో ఉన్న సుమారు 28 ఎకరాల భూమిని తీసుకోవాలని నిర్ణయించింది. అందులో ఈ ప్రాజెక్టులు అన్నీ అమలు చేయనున్నార.

 

 

Similar News