టీఆర్ఎస్ కు డీఎస్ ఝలక్

Update: 2018-09-04 07:28 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీ, సీనియర్ నేత డి. శ్రీనివాస్ పార్టీ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. అదను చూసి బంతిని సీఎం కెసీఆర్ కోర్టులోకి నెట్టారు. చేతనైతే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని..లేకపోతే తనకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనంతట తాను మాత్రం పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. తాను రాజీనామా చేస్తే పార్టీ నేతలు చేసిన ఆరోపణలు అంగీకరించినట్లు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణపై తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానో తెలపాలని ఆయన కోరారు. కేబినెట్ లో సగం మందిపైనే అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

ఎదిగిన తన కుమారులు రాజకీయంగా తమ సొంత నిర్ణయాలు తీసుకున్నారని..ప్రతి ఇంట్లోనూ ఇది సాదారణమే అని పేర్కొన్నారు. తాను పార్టీలో ఉండటం ఎంపీ కవితకు ఇష్టం లేదన్నారు. తన కుమారుడు అరవింద్ బిజెపిలో చేరతాడని ముందే కెసీఆర్ కు చెప్పినట్లు డీఎస్ వెల్లడించారు. అదే సమయంలో అరవింద్ విషయంలో ప్రభుత్వం అత్సుత్సాహం ప్రదర్శించిందని విమర్శించారు. తన అనుచరులను బిజెపిలోకి వెళ్లాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. పలు అంశాలతో డీఎస్ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు. ఈ పరిణామాలు చూస్తుంటే డీఎస్ పై వేటు పడటం ఖాయంగా కన్పిస్తోంది.

 

 

 

 

Similar News