అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు..కెసీఆర్ ఆదేశం

Update: 2018-08-29 07:46 GMT

మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. గురువారం నాడు హైదరాబాద్ లోని ఓ ఫాంహౌస్ లో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. బుధవారం ఉదయం నల్లగొండ వద్ద రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. కామినేని ఆస్పత్రిలో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తలకు తీవ్రంగా గాయం కావటంతో హరికృష్ణ మరణించారు.

విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణలు హుటాహుటిన నల్లగొండ జిల్లాలోని కామినేని ఆస్పత్రికి వచ్చి..హరికృష్ణకు నివాళులు అర్పించారు. అప్పటికే హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

Similar News