‘జనసేన’ తరపున ప్రచారం చేస్తా

Update: 2018-05-24 12:07 GMT

బాబాయ్ కు మద్దతుగా బరిలోకి దిగుతా అంటున్నాడు అబ్బాయి. ఈ బాబాయి..అబ్బాయి ఎవరో కాదు..పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. శ్రీకాకుళంలో పవన్ పోరాటయాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. మెగా హీరో రామ్ చరణ్ తాను జనసేన తరపున ప్రచారం చేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందుకు పవన్ కళ్యాణ్ అనుమతిస్తే చాలని చెబుతున్నారు.

ప్రస్తుతం బాబాయ్ ఒక్కరే ఎంతో కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తాను ప్రజారాజ్యం సమయంలోనే ఎన్నికల ప్రచారం చేద్దామనుకున్నానని..అప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణే వద్దని వారించారని తెలిపారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ కోరికను పవన్ కళ్యాణ్ తీరుస్తారో లేదో వేచిచూడాల్సిందే. ఓ మొబైల్ షోరూం ప్రారంభోత్సవ సమయంలో రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

Similar News