చంద్రబాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Update: 2018-05-23 06:13 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఏపీ సర్కారుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఏపీలో వైద్య మంత్రిని నియమించకపోతే..తాను యాత్ర ఆపి..ఒక్క రోజు నిరాహారదీక్షకు కూర్చుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాల్సిన పరిస్థితులు ఉన్నాయని..సమస్యలు చెప్పుకుందామంటే వైద్య ఆరోగ్య శాఖకు మంత్రే లేరని మండిపడ్డారు. కిడ్నీ సమస్యపై ప్రభుత్వంలో కదలిక వచ్చినా సమస్య ఇంత వరకూ పరిష్కారం కాలేదన్నారు. కనీసం ఈప్రాంతంలో సురక్షిత మంచినీరు కూడా లేదన్నారు. కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాకులం జిల్లా పలాసలో పవన్ కిడ్నీ బాధితులతో సమావేశం అయ్యారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుని ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించటంలో విపలమవుతోంది అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ రిసెర్చ్ సెంటర్ పెట్టాలని అమెరికా డాక్టర్లు సూచించారని తెలిపారు.

 

 

 

Similar News