‘అవినీతి వాటాలు’ చంద్రబాబే పంచారు

Update: 2018-02-22 05:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అవినీతి సెటిల్ మెంట్లు చేశారు. అదీ పక్కన ఇద్దరు ఐఎఎస్ అధికారులను కూర్చోబెట్టుకుని మరీ. ఈ విషయం ఎవరో ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు కావు. సాక్ష్యాత్తూ రాష్ట్ర మంతి ఆదినారాయణరెడ్డి వీడియో సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇవి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత ‘నిప్పో..నిజాయతీపరుడో’ మరోసారి సొంత మంత్రే బహిర్గతం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఏంటో మీరూ ఓ సారి చూడండి. ‘రామసుబ్బారెడ్డి గారికి కూడా ప్రతి రూపాయిలో అర్థరూపాయి వాటా ఉంటుంది. అర్థరూపాయి భాగం ఇవ్వమని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు.

ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను మాతో పక్కన కూర్చోపెట్టి పంచాయతీ చేసి మరీ చెప్పారు. ఆయన అడిగిన దాంట్లో మనకు సగం వస్తాది. మనం ఆడిగిన దాంట్లో ఆయనకు సగం వస్తది. వాళ్ళు దాంట్లో నన్ను ఏది విమర్శించినా..నేనైతె పట్టించుకోను. మీరెవరూ దయచేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగకండి. ఎస్ఎంఎస్ చేయండి. చేసి పెడతా. ఇవీ కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు.

https://www.youtube.com/watch?time_continue=24&v=xYTcIuwgjAA

 

Similar News