పాదయాత్ర ‘పవర్’ఫుల్ సాధనమా!

Update: 2018-01-29 14:45 GMT

పాదయాత్ర పవర్ లోకి తీసుకొస్తుందా?. అంటే అందరిదీ అదే నమ్మకం. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ప్రజలతో మమేకం కావొచ్చనేది రాజకీయ నేతల లెక్క. అప్పట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే మోడల్ ఫాలో అయ్యారు. సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేసి పవర్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర మోడల్ ను ఎంచుకున్నారు. 2017 నవంబర్ 6న జగన్ ప్రారంభించిన పాదయాత్ర 2018 జనవరి 29 నాటికి కీలక వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటిన సందర్బంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద ప్రత్యేక పైలాన్ ను ఆవిష్కరించారు.

వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నాయి. మూడువేల కిలోమీటర్ల పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర సోమవారానితో పూర్తయింది. జగన్ తన పాదయాత్రలో చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ..తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనే విషయాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాలలో జగన్ కు మద్దతుగా ‘వాక్‌ విత్‌ జగన్‌’ అంటూ వేలాదిమంది పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర మరో రెండు వేల కిలోమీటర్లు ముందుకు సాగాల్సి ఉంది.

 

 

 

Similar News