ఇదీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలంగాణ ప్రభుత్వానికి చేసిన రిక్వెస్ట్. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా ఆహ్వానించాలని సూచన. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి ఎలాగూ పిలవలేదు. కనీసం ముగింపు ఉత్సవాలకు అయినా పిలవండి. హైదరాబాద్ లో శుక్రవారం నాడు మీడియా సమావేశంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆయన చేసిన వినతి ఇది. అసలు ఓ కార్యక్రమానికి తమ ముఖ్యమంత్రిని పిలవాలని ఇలా విలేకరుల సమావేశంలో కోరాల్సిన అవసరం ఏమోచ్చిందని తెలుగుదేశం వర్గాలే విస్తుపోతున్నాయి. ఈ చర్యతో తమ పరువు తామే తీసుకున్నట్లు అయిందని..అసలు ఈ సమావేశాల్లో పాల్గొనకపోతే వచ్చే నష్టం ఏముందని ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ముద్దుకృష్ణమనాయుడు హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదవ తెలుగు ప్రపంచ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
దేశంలో హిందీ తరువాత తెలుగు మాట్లాడే ఎక్కువ మంది అని తెలిపారు. ఆనాడు తెలుగుదేశం అని ఎన్టీఆర్ పార్టీ పెరుపెడితే అందరూ నవ్వారు అని...కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా భాషను పార్టీని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ లోని కేసీఆర్ మంత్రివర్గం లో ఉన్న మంత్రులందరూ ఎన్టీఆర్ తయారుచేసిన వారే అని ముద్దు వ్యాఖ్యానించారు. ట్యాంక్ బండ్ పై 34మంది విగ్రహాలను పెట్టించింది ఎన్టీఆర్ అని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్ లు కూడా ఎన్టీఆర్ అనే చెట్టు నీడలో పెరిగిన వాళ్లే అని ముద్దుతెలిపారు. హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో చంద్రబాబు గొప్పతనాన్ని మంత్రి కేటీఆర్ ఒప్పుకున్నందుకు అభినందనలు తెలిపారు ముద్దుకృష్ణమనాయుడు.