ఆయనో ఐఏఎస్. కానీ ఆయన పుట్టిన రోజు జరిగిన హంగామా చూసి అంతా అవాక్కు అవుతున్నారు. ఆయన మరెవరో కాదు కాదు. కృష్ణా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం. డిసెంబర్ 1న ఆయన పుట్టిన రోజు చేసుకున్నారు. అందులో విశేషమేమీ లేదు. కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా రాయల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఏకంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసింది. అంతే కాదు ఆయన పౌరసన్మానికి సంబంధించిన హంగామా అంతా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. మార్గం పౌండేషన్, రాయల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ లు ఈ హంగామా చేశాయి. అంతే కాదు కలెక్టర్ తో మీట్ ది ప్రెస్ లో కూడా పాల్గొన్నారు.
ఇదంతా చూసిన వారు అవాక్కు అవుతూ కనీసం జిల్లా మంత్రులకు కూడా ఇలా పుట్టిన రోజుకు రక్తదాన శిబిరాలు ఉండవు కానీ..ఈ ఐఏఎస్ ఇంత హంగామా చేస్తున్నారు ఏమిటో అని చర్చించుకుంటున్నారు. అంతే కాదు..మీద్ ది ప్రెస్ సందర్భంగా కలెక్టర్ చాలా సంచలన విషయాలు చెప్పారు. అవేంటి అంటే కృష్ణా జిల్లా వ్యవసాయక జిల్లాగా పేరు పొందింది అట. పట్టిసీమ ద్వారా పంటలు బాగా పండుతున్నాయట. ఇండస్ట్రీయల్ గ్రోత్ రేట్ 18 శాతం ఉంది..ఇలా చాలా విషయాల ‘పెద్దల’ ట్యూన్ కు అనుగుణంగానే అన్నీ చెప్పారు.