ఆంధ్రప్రదేశ్ సర్కారు నిరుద్యోగులకు చల్లటి కబురు అందించింది. డీఎస్సీ ద్వారా సర్కారు ఒకేసారి 12,370 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వివరాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు విడుదల చేశారు. 2018 జూన్ 12 నాటికి ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. దీని కోసం డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు.
మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అదే సమయంలో రూ. 5 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ కాలేజీలపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు. 1998, 2008, 2012 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కరించడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని..ఆ నివేదిక రాగానే చర్యలు ఉంటాయని తెలిపారు.
నోటిఫికేషన్ వివరాలు :
26-12-2017 నుండి 8-02-2018 వరకు దరఖాస్తుల స్వీకరణ
09.03.2018 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు
05.05.2018 న ఫలితాల విడుదల
2018 జూన్ 12 నాటికి పోస్టింగ్‌లు