పవన్ కళ్యాణ్ కు ఆయనే శాపం

Update: 2017-11-30 07:38 GMT

తెలుగుదేశం ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు  ఆయన అన్న చిరంజీవే పెద్ద శాపం అని వ్యాఖ్యానించారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం ఆయన చేసిన పెద్ద పొరపాటు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో చాలా కష్టపడి సంపాదిస్తున్నారని..అయితే విత్తనాలు వేస్తే చాలదు కదా..పంట పండుతుందా? లేదా వేచిచూడాల్సి ఉందన్నారు. జె సీ దివాకర్ రెడ్డి వెలగపూడి అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎంపీలకు ప్రస్తుతం పెద్దగా విలువ లేకుండా పోయిందని అన్నారు.

                              వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనని..చంద్రబాబు కరుణిస్తే తన కుమారుడు బరిలోకి దిగుతాడని తెలిపారు.  ఎంపీలు పార్లమెంట్ లో చేయటానికి ఏమీలేదని వ్యాఖ్యానించారు. గుర్నాథ్ నాద్ రెడ్డి టీడీపీలో చేరినా..టిక్కెట్ కోరటం లేదన్నారు. ఎవరైనా సరే పార్టీలో చంద్రబాబు మాట ప్రకారమే ముందుకు సాగాల్సి ఉంటుందని అన్నారు. ఇక్కడ ఉన్నది ఒకటే నాయకత్వం అని తెలిపారు. వివాదస్పద బంగ్లా వ్యవహారం కోర్టులో ఉందని చెప్పారు.

 

Similar News