ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’కు బ్రేక్ పడింది. శుక్రవారం నాడు జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. నవంబర్ 6న జగన్ ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల తర్వాత జగన్ విరామం ఇచ్చారు. కోర్టుకు హాజరై వెంటనే మళ్లీ కడప బయలుదేరి వెళతారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
పాదయాత్ర ఉన్నందున ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుపై మినహాయింపు కావాలని జగన్ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ, ఈడీ అభ్యంతరాలతో సీబీఐ కోర్టు జగన్ హాజరుపై మినహాయింపు ఇవ్వటానికి నిరాకరించింది. దీంతో వారం వారం జగన్ తన పాదయాత్రకు బ్రేక్ వేయటం తప్పనిసరి అయింది.