అధికార టీడీపీ పరువు తీసే సంఘటన ఇది. వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన నియోజకవర్గ కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గిడ్డి ఈశ్వరిని టీడీపీలో చేర్చుకునే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి కోసం అందరూ తనతో కలసి రావాలని కోరారు. ఆ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గ..రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తీరా ఇప్పుడు బయటకొచ్చిన వీడియో అసలు విషయాన్ని బయటపెట్టింది.
కార్యకర్తలతో మాట్లాడిన సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘చంద్రబాబునాయుడు అంటే నాకేమీ ఇష్టం కాదు. పార్టీ జాయిన్ అయిన వెంటనే మంత్రి పదవి.. అది కుదరని పక్షంలో కేబినెట్ హోదాతో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందనే నేను టీడీపీలోకి వెళ్తున్నా.. ఎమ్మెల్యేగా ఇంకా ఏడాది టైమ్ ఉంది కాబట్టి మనం పనులన్నీ చేసుకోవచ్చు..’’ అని ఈశ్వరి వ్యాఖ్యానించారు.