జీఈఎస్ సదస్సుకు చంద్రబాబు ప్లాన్ ఏంటో తెలుసా!

Update: 2017-11-28 04:40 GMT

పారిశ్రామికవేత్తల సదస్సుల...సమావేశాలు..హంగామా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎంతో ఇష్టం. అందుకే అంతిమ ఫలితం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా  ప్రతి ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహిస్తారు. అంతే కాదు..ఏ చిన్న అవకాశం ఉన్నా సదస్సు..సమావేశాల ఏర్పాటును వదలరు. ఈ మధ్యే వైజాగ్ లో అగ్రిటెక్ సమ్మిట్ నిర్వహింటచమే కాకుండా...దానికి బిల్ గేట్స్ ను కూడా ఆహ్వానించారు. ఆయన కూడా ఓ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్) జరుగుతోంది. దీనికి ముఖ్యఅతిధులుగా ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, అమెరికా సలహాదారు ఇవాంకా ట్రంప్, తెలంగాణ సీఎం కెసీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ సదస్సును పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు షోకేస్ గా వాడుకుంటోంది. అంతే..ఇక మీడియా గత పది రోజులగా ఒకటే హంగామా చేస్తోంది. ఓ ఛానల్ చూసినా.. ఏ పేపర్ చూసినా దీనికి సంబంధించిన వార్తలే.

                                            ఒక్క ఇవాంకానే కాదు..ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన యువ పారిశ్రామిక వేత్తల బృందాలు హైదరాబాద్ వస్తున్నాయి. ఈ సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం లేదు. మరి ఎలా?. ఏమి చేయాలి. ఇంత పెద్ద ఎత్తున  పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వస్తే వాళ్ళకు  ఏపీ గురించి తెలిసేది ఎలా? అని ప్లాన్ వేశారు. అందుకు ఓ మార్గాన్ని ఎంచుకున్నారు. జీఈఎస్ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) తరపున  రెండు పేజీల భారీ ప్రకటన ఇచ్చింది. అందులోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1గా ఉందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.26 (2016) శాతంగా ఉందని..వరసగా రెండు సంవత్సరాలుగా ఇదే వృద్ధి రేటు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు..ఏపీలో జరుగుతున్న పలు అంశాలను కూడా ఈ భారీ ప్రకటనలో ప్రస్తావించారు. చూడాలి మరి చంద్రబాబు ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో.

 

Similar News