ఫస్ట్ ప్లేస్ లో సింగపూర్

Update: 2024-08-04 15:03 GMT

Full Viewకొన్ని చోట్లకు వెళ్లాలంటే భయం వేస్తుంది. మరి కొన్ని చోట్లకు ఎలాంటి భయం లేకుండా వెళ్లొచ్చు. ఇప్పుడు పర్యాటకులు ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్లగలిగే ప్రపంచంలోని టాప్ టెన్ ప్లేసెస్ జాబితా విడుదల అయింది. ఇందులో మొదటి స్థానం సింగపూర్ కు దక్కింది. వ్యక్తిగత భద్రత, ఆయా ప్రాంతాల్లో జరిగే నేరాలు, ఆరోగ్య భద్రత, డిజిటల్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా సిద్ధం చేశారు.

ఇందులో మొదటి స్థానంలో సింగపూర్ ఉంటే తర్వాత స్థానాల్లో వరసగా జపాన్ రాజధాని టోక్యో, కెనడాకు చెందిన టొరంటో, ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరం అయిన సిడ్నీ, స్విట్జర్లాండ్ కు చెందిన జురిక్, డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్ హేగన్, దక్షిణ కొరియా రాజధాని సియోల్, జపాన్ కు చెందిన నగరం ఒసాకా, ఆస్ట్రేలియా కు చెందిన మెల్బోర్న్ , నెదర్లాండ్స్ కు చెందిన అమస్టర్ డ్యామ్ లు ఉన్నాయి. ఫోర్బ్స్ అడ్వైజర్ ఈ లిస్ట్ విడుదల చేసింది.

Tags:    

Similar News