ఎన్విడియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ తన పదవి రాజీనామా చేశారు. కంపెనీ తాత్కాలిక సీఈఓ గా కొలెట్ క్రెస్ నియమితులు అయ్యారు. ప్రస్తుతం కొలెట్ క్రెస్ ఎన్విడియాలో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ)గా ఉన్నారు. చైనా కు చెందిన అలైస్ హువాంగ్ అనే మహిళతో ఎఫైర్ నిజమే అని...తన భార్యకు...కుటుంబానికి అన్యాయం చేశాను అంటూ ఇటీవల జెన్సన్ హువాంగ్ ఉద్యోగులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కంపెనీ బోర్డు కూడా విచారణ కు ఆదేశించింది. మరో వైపు ఈ వార్త గత కొన్ని రోజులుగా అమెరికా కార్పొరేట్..రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారానికి కారణం అయింది. ఈ వివాదం ఇలా సాగుతుండగానే ...జెన్సన్ హువాంగ్ కు తన కంపెనీలో పని చేసే మరో మహిళతో కూడా అక్రమ సంబంధం ఉంది అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం మరింత దుమారం రేపింది. వరసగా వెలుగులోకి వచ్చిన ఈ అక్రమ అఫైర్స్ తో జెన్సన్ హువాంగ్ తన పదవిని వీడాల్సి వస్తుంది అనే అంచనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో గురువారం రాత్రి జెన్సన్ హువాంగ్ సీఈఓ పదవికి రాజీనామా చేసారు అనే వార్త వెలువడింది.

                                            సీఈఓ పదవికే కాకుండా ఆయన బోర్డు సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పారు. శాశ్వత సీఈఓను ఎంపిక చేసే బాధ్యతను కంపెనీ బోర్డు ఇప్పటికే స్టార్ట్ చేసింది. జెన్సన్ హువాంగ్ అక్రమ అఫైర్స్ విషయాలు వరసగా బయటపడిన తర్వాత కంపెనీ షేర్లు కూడా భారీగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు కూడా గగ్గోలు పెట్టారు. కేవలం ఈ వార్తల కారణంగానే జెన్సన్ సంపద ఏకంగా 80000 వేల కోట్ల రూపాయల మేర హరించుకుపోయింది. చైనాకు చెందిన అలైస్ హువాంగ్ ఆ దేశ గూఢచారి అని గత కొంత కాలంగా అమెరికా మీడియా లో వార్తలు వచ్చాయి. దీనిపై ఈ దేశం విచారణకు కూడా ఆదేశించింది. సింగపూర్ లోని తన కంపెనీ ద్వారా ఆమె ఎన్విడియాకు చెందిన చిప్స్ కొనుగోలు చేయటమే కాకుండా...ఆమె వాటిని చైనాకు పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లే దీనికి సంబంధించి ఇంకెన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. అక్రమ సంబంధాల ఆరోపణల కారణంగా జెన్సన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ...ఆయన్ను తన కంపెనీలోకి తీసుకుంటాను అని ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Full View

Tags: