ఎన్విడియాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లేదు లేదు అంటూనే అకస్మాత్తుగా కంపెనీ బోర్డు తిరిగి కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్, బోర్డు డైరెక్టర్ గా జెన్సన్ హువాంగ్ ను నియమించింది. ఎన్విడియా బోర్డు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం వరకు కంపెనీ సీఈఓ గా జెన్సన్ నియామకం ముగిసిన అధ్యాయం అని స్పష్టంగా ప్రకటించిన కంపెనీ బోర్డు ఇంత సడన్ గా తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుంది?. తిరిగి జెన్సన్ కు కీలక బాధ్యతలు అప్పగించటం వెనక ఏమి జరిగింది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. చైనాకు చెందిన స్పై గా అనుమానిస్తున్న అలైస్ హువాంగ్ తో అక్రమ సంబంధం...కంపెనీ ఉద్యోగులతోనూ రిలేషన్స్ కలిగి ఉన్నారు అనే ఆరోపణలు బయటపడటంతో ఆయన కంపెనీ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. తర్వాత భారీ ఎత్తున ఉద్యోగులతో పాటు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ వంటి వాళ్ళు కూడా ఆయన్ను తిరిగి నియమించుకుంటే మంచిది అంటూ సూచించారు.

                                     కానీ అప్పటిలో బోర్డు దీనికి నో చెప్పుకుంటూ కొత్త సీఈఓ ను వెతికే పని మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు అన్నీ పక్కకు పోయి జెన్సన్ మళ్ళీ సీఈఓ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ వార్త వెలువడిన వెంటనే ప్రీ ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు దూసుకెళ్లాయి. జెన్సన్ పునర్నియామకం కంపెనీ షేర్ హోల్డర్లకే కాకుండా పెట్టుబడిదారులకు ఎంతో మేలు చేస్తుంది అని బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది. జెన్సన్ వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదు అని నిర్దారించుకున్న తర్వాతే పునర్నియామకం జరిగినట్లు చెపుతున్నారు. చైనాకు చెందిన అలైస్ హువాంగ్ తో సన్నిహిత సంబంధాల వల్ల కంపెనీకి చెందిన వ్యవహారాలతో పాటు కీలకమైన చిప్స్ ఈ దేశానికీ వెళ్లాయని ఆరోపణలు..అనుమానాలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద దుమారం రేపింది. జెన్సన్ ను సీఈఓ గా పునర్నియమించినా కూడా పలు అంశాలపై విచారణ కొనసాగుతుంది అని తెలిపారు.

                                    ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే జెన్సన్ రాజీనామా తర్వాత ఎన్విడియాలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారీ పెట్టుబడులు పెట్టారని..ఇందులో ఆయనకు పెద్ద ఎత్తున లాభాలు కూడా వచ్చినట్లు నివేదికలు బయటకు వచ్చాయి. అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం ఆమోదంతోనే ఎన్విడియా కు చెందిన చిప్స్ చైనాకు ఎగుమతి అయినట్లు కూడా చెపుతున్నారు. కంపెనీ బోర్డు తిరిగి జెన్సన్ హువాంగ్ ను సీఈఓ గా నియమించడంపై డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది కంపెనీ కే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది అని పేర్కొన్నారు. జెన్సన్ దేశ భక్తుడు అని..ఆయన వల్ల దేశానికీ ఎలాంటి ముప్పు ఉండే అవకాశం లేదు అన్నారు. కంపెనీ తాత్కాలిక సీఈఓ గా ఉన్న క్రిస్ కోలెట్ సిఎఫ్ఓ గా కొనసాగుతారు అని తెలిపారు.

Tags: