బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ లోని దారుణం జరిగింది. హాస్టల్ లో తనతో కలసి పనిచేస్తున్న యువతిపైనే దారుణానికి ఒడిగట్టింది మరో యువతి. తన సహ ఉద్యోగిని బాత్రూమ్లో స్నానం చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీసి ప్రియుడికి అప్లోడ్ చేసింది. ఆ నర్సును ఆదివారం వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ ఇన్చార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నర్సు అశ్వినినీ అదుపులోకి తీసకుని ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. వైట్‌ఫీల్డ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్విని నర్సుగా పనిచేస్తోంది. అత్యవసర సేవల విభాగంలోని నర్సులకు హాస్టల్ వసతి కల్పించారు.
ఈనెల 5న సాయంత్రం ఓ నర్సు తన గదిలో స్నానం చేస్తుండగా బాత్రూమ్లో మొబైల్ కనిపించడంతో భయపడిన సదరు నర్సు దాన్ని పరిశీలించగా వీడియో రికార్డు అయినట్లు గుర్తించి హాస్టల్ ఇన్చార్జ్కు ఫిర్యాదు చేసింది. ఫోన్ అశ్వినిది కావడంతో ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది. పోలీసు కేసు నమోదు కావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.