ఆ దిశగానే అమెరికా..ఇజ్రాయెల్ ప్లాన్స్!

Update: 2026-03-02 07:52 GMT

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధం మరికొంత కాలం కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా పకరటించారు కూడా. ఇరాన్ లాంటి దేశాన్ని పూర్తిగా దారికి తెచ్చుకోవడానికి తమకు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టవచ్చు అన్నారు. అయితే ఇరాన్ తమతో చర్చలకు సిద్ధంగా ఉంది అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించగా...వీటిని ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికాతో చర్చలు జరిపేది లేదు అని, చర్చల కోసం మేం ఎవరినీ సంప్రదించలేదు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ స్పష్టం చేశారు. చర్చలపై ట్రంప్ చెప్పినవన్నీ అబద్ధం అని స్పష్టం చేసింది. దీంతో ఇరాన్ కూడా అమెరికా విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేదు అని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

                                      ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ టార్గెట్ అమెరికా-ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ విజయంవంతం అయిన సంగతి తెలిసిందే. ఇందులో అయతుల్లా అలీ ఖొమైనీ తో పాటు ఇరాన్ కు చెందిన పలువురు కీలక నేతలు కూడా హతం అయిన సంగతి తెలిసిందే. ఇరాన్‌తో యుద్ధం ముగిసేలోపు మరింత మంది అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ' మరికొద్ది రోజుల పాటు పూర్తి స్థాయిలో కొనసాగుతుందన్నారు. అలాగే అమెరికా సైనికుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందారు. మా సైనికుల మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. అయినా ముందుకే వెళ్తాం. ఈ దాడుల వల్ల ఇరాన్‌లో 200 మంది మరణించినట్టు తెలిసింది.

                                                ఇరాన్ ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పించేందుకు సిద్ధం. లేదంటే వారికి చావు తప్పదు. అలాగే చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి' అని ట్రంప్ పేర్కొన్నారు అదే సమయంలో తనపై జరిగిన హత్యాయత్నాల గురించి కూడా ట్రంప్ స్పందించారు. 'ఖమేనీ ప్రోద్బలంతో నాపై ఇప్పటికి రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయితే, నేను మొదటి ప్రయత్నంలోనే అతడి కథను ముగించా. నన్ను పట్టుకోకముందే, నేను అతడిని పట్టుకున్నా. ఇరాన్‌పై విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాం. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద కష్టం కాదు' అని ట్రంప్ పేర్కొన్నారు.

Tags:    

Similar News