ప్రతీకారం తప్పదంటున్న ఇరాన్

Update: 2026-07-08 03:48 GMT

ఇరాన్ పై అమెరికా మరో సారి దాడులకు దిగింది. ఒక వైపు ఇరాన్ లో దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ అంత్యక్రియల కార్యక్రమాలు సాగుతున్న వేళ అమెరికా తాజా దాడులకు దిగటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇరాన్ హర్ముజ్ జలసంధిలో తాజాగా నౌకలపై దాడులు చేయటానికి ప్రతిగానే తాము ఇరాన్ పై దాడులు చేసినట్లు అమెరికా అధికారికంగా వెల్లడించింది. అమెరికా తాజా దాడులపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. దీనికి తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. అమెరికా దాడులకు కౌంటర్ గా ఇరాన్ మరో సారి బహ్రెయిన్ పై వరసగా డ్రోన్లు...మిస్సెల్స్ తో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇరాన్ దాడులకు పాల్పడటంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా తాజగా ఖేష్మ్‌ ఐల్యాండ్‌, బందర్‌ అబ్బాస్‌, సిరిక్‌ వంటి 10 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇరాన్‌ దురాక్రమణ ప్రమాదకరం, సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.

                               వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిస్పందనగానే తాము దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ఉన్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్‌ ఇందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే. యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు శక్తివంతమైన దాడులను ప్రారంభించాయి. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఈ దాడులు చేస్తోంది. ఇరాన్ దురాక్రమణ నిరాధారమైనది, ప్రమాదకరమైనది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే’ అని పేర్కొనటం అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మరో వైపు ఈ దాడులకు ముందే అమెరికా చమురు విక్రయాలకు సంబంధించి ఇరాన్ లైసెన్స్ ను రద్దు చేసింది. హర్ముజ్ లో ఇరాన్ చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజా పరిణామాలకు అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ పై తాజాగా అమెరికా చేసిన దాడులతో మరో సారి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.

Tags:    

Similar News