ఆత్మహత్య చేసుకునేందుకు ఇప్పుడు ఓ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. శవపేటిక తరహాలో దీని డిజైన్ ఉంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్విట్జర్లాండ్ లో ఈ మెషిన్ న్యాయసమీక్ష కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి బాధ లేకుండా నిమిషం వ్యవధిలోనే ఈ మెషిన్ ద్వారా ఆత్మహత్య చేసుకోవచ్చని దీని తయారీదారులు వెల్లడించారు. ఈ మెషిన్ లో ఆక్సిజన్ స్థాయిలను అతి తక్కువ స్థాయికి చేర్చటం ద్వారా ఆత్మహత్యకు మార్గం సుగమం చేస్తారు.ఈ మెషిన్ ను లోపల నుంచి కూడా ఆపరేట్ చేయవచ్చని వెల్లడించారు.
ఈ విషయాన్ని ఇండిపెండెంట్ పత్రిక వెల్లడించింది. ఈ మెషిన్ ను నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్లొచ్చని తెలిపారు. డాక్టర్ ఫిలిప్ ఈ సూసైడ్ మెషీన్ తయారీలో కీలక పాత్ర పోషించారు. స్విట్జర్లాండ్ లో ఎవరి సహకారంతో అయినా ఆత్మహత్య చేసుకోవటాన్ని అనుమతిస్తారు. అయితే ఈ మెషీన్ తయారీపై విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. ఇది గ్యాస్ ఛాంబర్ వంటిదే అనే వ్యాఖ్యలు వస్తున్నాయని పత్రిక వెల్లడించింది. అయితే భారత్ తో సహా పలు దేశాల్లో ఆత్మహత్య నేరంగా పరిగణిస్తారు.