స్టాక్ మార్కెట్ కు ఈ మంగళవారం బిగ్ డే. ఎందుకంటే మార్కెట్ దశ, దిశను నిర్ణయించే బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఉదయం పదకొండు గంటలకు ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక సర్వే ఇచ్చిన ఊపుతో బడ్జెట్ కూడా సానుకూలంగానే ఉంటుందనే అంచనాలతో నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. కీలక రంగాలకు చెందిన షేర్లు అన్నీ గ్రీన్ లో కొనసాగుతున్నాయి. శుభారంభం చేసిన మార్కెట్ బడ్జెట్ తర్వాత ఎటువైపు కదులుతుంది అనేదే అత్యంత కీలకం.