ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ప్రముఖ ఏఐ కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్ అయిన 'లైట్‌స్టార్మ్', ఇండియా, మలేషియా, సింగపూర్‌లను కలుపుతూ సరికొత్త సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి తన భాగస్వామ్య సంస్థలైన మైక్రోసాఫ్ట్, సింగ్‌టెల్ మరియు టాటా కమ్యూనికేషన్స్‌తో అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ కేబుల్ సిస్టమ్‌కు 'I-2SEA' అని పేరు పెట్టారు. ఇండియా-ఆగ్నేయాసియా కారిడార్‌లో ఏఐ ట్రైనింగ్ మరియు ఇన్‌ఫరెన్స్ వర్క్‌లోడ్‌లను నిర్వహించే హైపర్‌స్కేలర్స్, జీపీయూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ మరియు కార్పొరేట్ సంస్థల నుండి వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ I-2SEA కేబుల్ సిస్టమ్, భారతదేశ తూర్పు తీరాన్ని నేరుగా సింగపూర్ మరియు మలేషియాలతో కలుపుతుంది. భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ మరియు హైపర్‌స్కేలర్ డేటా సెంటర్ క్లస్టర్‌లు అయిన హైదరాబాద్, చెన్నైలను.. ఈ ప్రాంతంలోనే అత్యంత ప్రముఖ క్లౌడ్ ఇంటర్‌కనెక్ట్ మరియు ఏఐ హబ్‌గా ఉన్న సింగపూర్‌తో మరియు మలేషియాలో కొత్తగా ఎదుగుతున్న కౌలాలంపూర్ డేటా సెంటర్ కారిడార్‌తో ఇది నేరుగా అనుసంధానిస్తుంది.
ఈ కేబుల్ సిస్టమ్‌కు భారతదేశంలో రెండు ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. అందులో ఒకటి మచిలీపట్నంలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నగరానికి అత్యంత తక్కువ దూరంలో ఉండే సముద్ర మార్గాన్ని అందిస్తుంది. రెండవది దక్షిణ చెన్నైలోని సరికొత్త ల్యాండింగ్ పాయింట్ వద్ద ఉంటుంది. ఈ కేబుల్ సిస్టమ్‌లోని లైట్‌స్టార్మ్ కస్టమర్లు కంపెనీకి చెందిన 30,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావచ్చు. దీని ద్వారా హైదరాబాద్, ముంబైలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 80 కంటే ఎక్కువ డేటా సెంటర్లను సులభంగా చేరుకోవచ్చు. సింగపూర్ నుండి మచిలీపట్నం వరకు సుమారు 3600 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ హై-కెపాసిటీ కేబుల్ సిస్టమ్, 2029 నాలుగో త్రైమాసికం నాటికి సేవలకు సిద్ధం అవుతుందని అంచనా. ఈ కేబుల్‌ను హైదరాబాద్‌కు అనుసంధానించే లైట్‌స్టార్మ్ యొక్క తక్కువ లేటెన్సీ బ్యాక్‌హాల్ నెట్‌వర్క్‌తో కలిపినప్పుడు, ఇది సింగపూర్/మలేషియా–హైదరాబాద్ కారిడార్‌లో అన్ని కేబుల్స్ కంటే అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది.
ఏఐ వర్క్‌లోడ్‌లపరంగా ఈ ప్రాంతంలోనే ఇది అత్యంత వ్యూహాత్మకమైన మరియు కీలకమైన నగరాల జంటగా నిలవనుంది. “లైట్‌స్టార్మ్ మేథస్సును అనుసంధానించడమనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. I-2SEAలో మెజారిటీ వాటాదారుగా మరియు ఇప్పటికే భారత్‌లోని డేటా సెంటర్లు, జీపీయూ క్లస్టర్లలో ఏఐ-రెడీ రవాణాను అందిస్తున్న మా ‘స్మార్ట్‌నెట్ ఏఐ ఫ్యాబ్రిక్’ (SmartNet AI Fabric)తో కలిపి, ఇప్పుడు ఆ ప్లాట్‌ఫాంను సముద్ర మార్గంలోకి కూడా విస్తరిస్తున్నాం. మా నెట్‌వర్క్ ద్వారా ఇండియా, మలేషియా మరియు సింగపూర్‌లలోని ఏఐ రీజియన్లు అన్నీ కూడా ఏఐ ఇన్‌ఫ్రాకు అవసరమైన అత్యుత్తమ పనితీరు మరియు సామర్థ్యాన్ని అందించేలా రూపొందించబడిన ఒకే ఒక ప్రత్యేకమైన ఎండ్-టు-ఎండ్ సిస్టమ్‌తో అనుసంధానించబడ్డాయి” అని లైట్‌స్టార్మ్ గ్రూప్ సీఈఓ & ఎండీ అమజిత్ గుప్తా (Amajit Gupta) తెలిపారు. లైట్‌స్టార్మ్ కస్టమర్ల కోసం, ఈ I-2SEA కేబుల్ సిస్టమ్ లైట్‌స్టార్మ్ యొక్క 'స్మార్ట్‌నెట్ ఏఐ ఫాబ్రిక్'ను సముద్ర మార్గంలో అనుసంధానిస్తుంది.
దీనిని డేటా సెంటర్లు, క్లౌడ్ హబ్‌లు మరియు డిస్ట్రిబ్యూటెడ్ ఏఐ జోన్‌ల మధ్య తక్కువ అంతరాయంతో, నష్టం లేని రవాణా కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ కేబుల్ సిస్టమ్ యొక్క ఇండియన్ ల్యాండింగ్ స్టేషన్లను లైట్‌స్టార్మ్ నిర్వహిస్తుంది. అలాగే తన స్మార్ట్‌నెట్ ఏఐ ఫాబ్రిక్ మరియు పోలారిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకీకృత నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్‌ను అందించడానికి ఇది సన్నద్ధమైంది. ఈ సిస్టమ్ భారతదేశంలోని రెండు ల్యాండింగ్ పాయింట్ల వద్ద ఇంటర్‌ఆపరబుల్ కేబుల్ ఆర్కిటెక్చర్ మరియు క్యారియర్-న్యూట్రల్ ల్యాండింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కలిగి ఉంటుంది. డిమాండ్‌కు అనుగుణంగా సేవలు అందించే మరియు రియల్-టైమ్ నెట్‌వర్క్ విజిబిలిటీని ఇచ్చే లైట్‌స్టార్మ్ యొక్క పోలారిన్ ప్లాట్‌ఫామ్‌తో కలిపి, కస్టమర్లు I-2SEA సామర్థ్యాన్ని ఎంతో వేగంగా మరియు ఫ్లెక్సిబుల్‌గా యాక్టివేట్ చేసుకోవచ్చు, విస్తరించవచ్చు మరియు పర్యవేక్షించవచ్చు.