సోనూసూద్ కు కరోనా నెగిటివ్

Update: 2021-04-23 14:31 GMT

కరోనా బారిన పడిన ప్రముఖ నటుడు, ఈ సంక్షోభ సమయంలో విశేష సేవలు అందించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది మన్ననలు పొందిన సోనూసూద్ కరోనా నుంచి కోలుకున్నారు. తనకు నెగిటివ్ వచ్చిన విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలోనూ ఆయన చాలా సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ సమయాన్ని కూడా పేదలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశంగా భావిస్తానని ప్రకటించారు.

చెప్పినట్లే తనదైన శైలిలో సేవలు అందించే ప్రయత్నం చేశారు. సోనూసూద్ కరోనా నుంచి కోలుకున్న వార్త వెలువడిన వెంటనే ఆయన అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ''ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్స్‌'' ఈ మూడు పదాలే తనకు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్నిసార్లు పాస్ అవుతున్నా, మరి కొన్నిసార్లు విఫలమవుతున్నా..అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవుడు అందరినీ చల్లగా చూడాలంటూ సోనూ సూద్ ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News

భారీ పతనం