జులై 21 న కంపెనీ షేర్ల లిస్టింగ్

Update: 2026-07-16 15:12 GMT

ఎస్ బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీవో దుమ్మురేపింది. మదుపరుల నుంచి ఈ ఇష్యూకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. మార్కెట్ నుంచి 9812 కోట్ల రూపాయల సమీకరణ కోసం ఎస్ బిఐ ఫండ్స్ జులై 14 న ఐపీవో ను ప్రారంభించింది. ఈ ఇష్యూ జులై 16 న ముగిసింది. ఎస్ బిఐ ఫండ్స్ మొత్తం 12 .45 కోట్ల షేర్లను జారీ చేయనుండగా...ఏకంగా 518 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలు అయ్యాయి. ఐపీవో గడువు ముగిసే నాటికి అంటే గురువారం సాయంత్రానికి ఈ ఇష్యూ 41 .66 రేట్ల ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. మొత్తం ఈ ఐపీఓకి 65 లక్షల అప్లికేషన్స్ రాగా..ఈ ఏడాది ఒక ఐపీఓకు ఇంత భారీ మొత్తంలో అప్లికేషన్స్ రావటం ఇదే మొదటి సారి కావటం విశేషం.

                                             ఎస్ బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ తన ఐపీవో కి ధరల శ్రేణిని 545 -574 రూపాయలుగా నిర్ణయించింది. పూర్తి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మోడల్ లోనే షేర్ల జారీ జరగనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ కు 3 .60 రేట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ కాగా...అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబి) పోర్షన్ కు అత్యధికంగా 140 .11 రేట్ల బిడ్స్ దాఖలు అయ్యాయి. జులై 17 నాటికి ఈ ఐపీవో షేర్ల కేటాయింపు ఖరారు అయ్యాయి అవకాశం ఉంది. ఆఫర్ ధర కంటే ఈ షేర్లు 15 నుంచి 20 శాతం ప్రీమియం తో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఎస్ బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు జులై 21 న ఎన్ఎస్ఈ తో పాటు బిఎస్ఈ లో నమోదు కానున్నాయి.

Tags:    

Similar News