ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ప్లాట్ ఫార్మ్ పబ్లిక్ ఇష్యూ వివరాలు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం జియో పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 21 న మొదలై...23 న ముగియనుంది. దేశంలోనే అతి పెద్ద ఐపీవో గా రిలయన్స్ జియో రికార్డు నమోదు చేయబోతోంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ 30000 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమీకరించనుంది. ఐపీవో కి సంబంధించి బుధవారం నాడు రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్ హెచ్ పీ) దాఖలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన షేర్ హోల్డర్ల కోసం 2500 కోట్ల రూపాయల విలువగల షేర్లను రిజర్వు చేశారు. జియో ఐపీవో కింద ఒక్కొక్కట్లి పది రూపాయల ముఖ విలువ గల మొత్తం 27 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు.

                                Full View500 కోట్ల రూపాయల విలువగల షేర్లను ఉద్యోగుల కోసం కేటాయిస్తున్నారు. జియో షేర్ల ధరల శ్రేణి 1065 రూపాయల నుంచి 1119 రూపాయలుగా ఉంటుంది అని చెపుతున్నారు. ఈ విషయాన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దేశంలో ఇప్పటి వరకు అతి పెద్ద ఐపీవో అంటే హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దే అని చెప్పాలి. ఈ సంస్థ మార్కెట్ నుంచి 2024 లో 27858 .75 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన ఎన్ఎస్ఈ ఐపీవో హ్యుండయ్ ని దాటి పోతుంది అని తొలుత ప్రచారం జరిగినా కూడా ఈ సంస్థ మార్కెట్ నుంచి 22562.71 కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించటంతో ఇది రెండవ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జియో ఐపీవో అన్ని రికార్డు లను బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్ కు చేరనుంది.

Tags: