హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలకు నో

Update: 2020-12-25 08:29 GMT

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. పబ్లిక్, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు స్టార్ హోటల్స్ లో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇస్తామన్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ ఇప్పటికే మొదలుపెట్టాం. రిసార్ట్స్, పబ్ లపై నిఘా. తాగి వాహనం నడిపితే చర్యలే. పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదన్నారు.దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికేే నిషేధంపై ప్రకటనలు చేశాయి. ఏపీలో కూడా నూతన సంవత్సర వేడుకలను నిషేధించారు. 

Tags:    

Similar News