కొద్ది రోజుల క్రితమే శ్రీ లంక తో పాటు థాయిలాండ్ కూడా భారత పర్యాటకులు కోసం వీసా లేకుండా తమ తమ దేశాల్లో పర్యటించే వెసులుబాటు కలిపిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వియత్నాం కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మలేషియా ఈ జాబితాలో చేరిపోయింది. పలు కీలక దేశాలు వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పిస్తుండటంతో ప్రయాణికులకు డబ్బు ఆదా కావటంతో పాటు ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేకుండా పోతుంది. కేవలం టికెట్ కొనుగోలు చేసి ఆయా దేశాలను చుట్టేసి రావొచ్చు.