ఇప్పుడు ఇండిగో ఎయిర్ ఇండియా కంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్ ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థలుగా ఉన్న ఎయిర్ ఇండియా, ఇండిగో లు పెద్ద ఎత్తున విస్తరణ బాటలో నడవనున్నాయి. దేశీయ రూట్ల తో పాటు అంతర్జాతీయ గమ్య స్థానాలకు తమ తమ సర్వీస్ లు పెంచే పనిలో ఈ రెండు ఎయిర్ లైన్ ఉన్న విషయం తెలిసిందే. తాజా ఆర్డర్ ప్రకారం ఇండిగో కు కొత్త విమానాలు 2030 నుంచి 2035 సంవత్సరాల మధ్య అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో ఎప్పటిలాగానే ఏ 320 విమానాలు సేకరించనుంది.