ఏప్రిల్ లో మరింత తగ్గుతాయా?!

Update: 2026-03-21 16:02 GMT

ఒక వైపు ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ స్పష్టత లేదు. ఈ యుద్ధం తీవ్రం అవుతున్న వేళ బంగారం ధరలు భారీగా పెరుగుతాయి అన్న అంచనాలకు భిన్నంగా గోల్డ్ రేట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ రేట్లు ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు ఎక్కువ మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. దేశంలో పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ఎన్నికలు లేకపోయి ఉంటే ఇప్పటికే ధరలు పెరిగి ఉండేవి అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. కొంత ఆలస్యంగా అయినా ఈ ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్లకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బంగారం కొనుగోళ్లపై ప్రభావం పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఏప్రిల్ 15 వరకు బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అని...ఎక్కువ శాతం రేట్లు తగ్గటానికి ఛాన్సులు ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు.

                                  Full Viewడాలర్ రేట్ బలోపేతం అవటం...అధిక వడ్డీ రేట్లు కూడా ఇందుకు కారణంగా చెపుతున్నారు. వచ్చే నెలలో మొదటి పదిహేను రోజులు తీవ్ర ఒడిడుకులు ఎదుర్కొని...తర్వాత స్థిరంగా పెరగటానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెపుతున్న మాట. గత రెండు రోజుల్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతోనే రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. హైదరాబాద్ లో శనివారం నాడు పది గ్రాముల 24 క్యారట్ బంగారం ధర 1 , 49 , 992 రూపాయలుగా ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధర 13 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. వెండి ధరల్లో కూడా భారీ పతనం అవుతున్న నమోదు అవుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా బంగారం ధరల్లో తగ్గుదలకు ఛాన్స్ ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.

Tags:    

Similar News