జీఎంఆర్ గ్రూపు నుంచి బుధవారం నాడు కొత్త కంపెనీ లిస్ట్ కానుంది. ఇటీవలే జీఎంఆర్ ఇన్ ఫ్రా నుంచి విద్యుత్, పట్టణ మౌలికసదుపాయాల విభాగాలను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేశారు. విమానాశ్రయాల వ్యాపారంతో కూడిన జీఎంఆర్ ఇన్ ఫ్రా ఇప్పటికే ట్రేడ్ అవుతుండగా..బుధవారం నుంచి జీఎంఆర్ పవర్ అండ్ అర్భన్ ఇన్ ఫ్రా లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, ఎన్ ఎస్ ఈల్లో లిస్ట్ కానున్నాయని కంపెనీ షేర్ హోల్డర్లకు సమాచారం అందించింది. జీఎంఆర్ ఇన్ ఫ్రా వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో పది షేర్లు ఉన్న వాటాదారులకు ఐదు రూపాయల ముఖ విలువ గల ఒక్కో షేరును కేటాయించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరుకే ఈ షేర్లు లిస్ట్ కావాల్సి ఉన్నా..రకరకాల కారణలతో వాయిదా పడి..మార్చి 23 నుంచి లిస్ట్ కానున్నాయి.