స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర 948 రూపాయలు

Update: 2021-05-14 07:04 GMT

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర ఖరారు అయింది. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను 948 రూపాయలకు విక్రయించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. దేశంలో ఈ వ్యాక్సిన్ సరపరా ఒప్పందాన్ని డాక్టర్ రెడ్డీస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే దేశీయంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు..ప్రైవేట్ ఆస్పత్రులకు ఒక్కో ధరలను నిర్ణయించాయి. అయితే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మాత్రం అందరికీ 948 రూపాయలకు అందుబాటులో ఉండనుంది.

Tags:    

Similar News