ఢిల్లీ లో శనివారం నాడు అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపీ) నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో సిజెపీ శనివారం నాడు జంతర్ మంతర్ దగ్గర నిరసన చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం లాక్ డౌన్ తరహా వాతావరణం సృష్టించింది. మెట్రో స్టేషన్స్ మూసివేయటంతో పాటు ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. సహజంగా కరుడుగట్టిన నేరస్థులను మాత్రమే విమానంలోకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకుంటారు. కానీ సిజెపీ నేతలను అదుపులోకి తీసుకునే ముందు ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ విషయంలో ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండా చూసేందుకే మహిళా అధికారులను విమానంలోకి పంపినట్లు కనిపిస్తోంది అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. విమానంలో తమను అదుపులోకి తీసుకున్న విషయాలను సిజెపీ ఫౌండర్ దీప్కే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

                                  Full Viewవిమానం నుంచి ప్రయాణికులు దిగే వరకు వేచి చూడకుండా తమను అదుపులోకి తీసుకోవడంపై సీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము అరెస్ట్ కు సిద్దంగానే ఉన్నామని..తాము వీటికి భయపడం అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ప్రతిపాదించిన నిరసనకు నాయకత్వం వహించేందుకు సిజెపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. తమను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నా కూడా తమ డిమాండ్ లో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పారు. సిజెపీ నేతలు అరెస్ట్ అయినా కూడా ఢిల్లీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది యువత నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళను వచ్చినట్లే పోలీసులు అదుపులోకీ తీసుకుని స్టేషన్స్ కు తరలిస్తున్నారు.

Tags: