బీఎండబ్య్లూ. ఆ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ ఎంతో తెలిసిందే. బీఎండబ్ల్యూ కార్లే కాదు..బైక్ లు ఉన్నాయి. తాజాగా కంపెనీ కొత్త బైక్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ఆర్ 18 క్లాసిక్ బైక్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరను 24 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఈ బైక్ ఇంజిన్ సామర్థ్యం 1902 సీసీగా ఉంది. ఇందులో ఆరు గేర్లు ఉంటాయి.
రెయిన్, రోల్, రాక్ మోడ్స్ అనే మూడు రైడింగ్ మోడ్లను కలిగి ఉంది. ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ట్రక్ కంట్రోల్, హిల్ స్వార్డ్ కంట్రోల్. కీలెస్ రైడ్ సిస్టం, ఎలక్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ సీబీయూ(కంప్లీట్లే బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారత్లకి దిగుమతి అవుతుందని, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని బీఎండబ్య్యూ తెలిపింది.