తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నీలగిరి ప్రాంతాల్లో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయింది. కోయంబత్తూరు-సూలూర్ ప్రాంతాల మధ్య ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన అర్మీ హెలికాప్టర్ లో చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తోపాటు ఆయ భార్య, ఇతర కుటుంబ సభ్యులు కొంత మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమదానికి ముందు హెలికాఫ్టర్ తో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది.